Blog Archive

Friday, November 18, 2011

స్పైసీ చిల్లీ ఫిష్.-Weekend special

Spicy Chilli Fish

కావలసిన పదార్థాలు:
ఫిష్(పామ్ ఫ్రెట్/సాల్మన్/బాంబేడక్)(బోన్ లెస్): 7-8
మొక్కజొన్న పిండి: 3tbsp
గుడ్డు తెల్ల సొన: 2
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
ఉల్లిపాయ: 1(కట్ చేసినవి)
వెల్లుల్లిపాయలు: 6-8(చిన్నగా కట్ చేసినవి)
పచ్చిమిర్చి: 8-10(కట్ చేసినవి)
చిన్నఉల్లిపాయ(పచ్చికాడఉల్లిపాయ): 4కట్ చేసినవి
క్యాప్సికమ్: 1మీడియంగా కట్ చేసినవి
పెప్పర్(మిరియాలు)ఫ 2tbsp
సోయా సాస్: 2tbsp
వెనిగర్: 1tbsp
అజినామాటో లేదా చైనా గ్రాస్: చిటికెడు
నూనె: 4tbsp
ఉప్పు: రుచికి తగినింత
తయారు చేయు విధానము:
1.మొదటగా ముళ్ళు లేని చేపలను తీసుకొని బాగా శుభ్రం చేసి చుట్టుతా గాట్లు పెట్టుకోవాలి. వాటి మీద వెనిగర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరియాలు పేస్ట్ అన్ని ఒక మిశ్రంగా తయారు చేసుకొని గాట్లు పెట్టిన ఫిష్ మీద, చుట్టు ప్రక్కలా బాగా ఈ మిశ్రమాన్ని పూతగా రాసి 1 గంటపాటు పక్కన పెట్టుకోవాలి.
2. గుడ్డును పగుల గొట్టి, తెల్లటి ద్రవాన్ని మాత్రం తీసుకొని అందులో మొక్కజొన్న పిండి కలిపి బాగా గిలకొట్టాలి..చిక్కటి పేస్టులా తయారు అవుతుంది.
3. ఇప్పుడు పాన్ లో నూనె వేసి కాగనివ్వాలి ఇప్పడు స్టౌ ని తక్కువ మంటలో పెట్టుకొని మొదటగా ప్రిపెర్ చేసి పెట్టుకొన్న చేపముక్కలను గుడ్డు మిశ్రమంలో ముంచి వేడి నూనెలో వేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు అదే నూనెలో కట్ చేసి పెట్టుకొన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి, చిన్న ఉల్లిపాయలు అన్నిటి వేసి బాగా వేగనివ్వాలి.
5. ఇప్పుడు వాటికి అల్లం వెల్లుల్లిపేస్ట్, క్యాప్సికమ్ వేసి 5నిమిషాలపాటు తక్కువ మంటలో ఉడకనివ్వాలి.
6. తర్వాత వెనిగర్, పచ్చిమిర్చి, మిరియాలు పేస్ట్, వేసి బాగా కలియబెడుతూ మరికొద్దిసేపు ఉడకనివ్వాలి.
7. తర్వాత అజినామోటో చిలకరించి సోయా సాస్ వేసి బాగా మిశ్రమాన్నంతటిని కలిపి ఒక కప్పు నీళ్ళు అందులో పోసి బాగా కాగనివ్వాలి.
8. ఇప్పుడు ఉడుకుతున్న చిక్కటి గ్రేవీలో ఫ్రై చేసిన ఫిష్ ముక్కలు అందులో వేసి 5నిమిషాల పాటు బాగా బాగా ఫ్రై చేయాలి. అంతే టేస్టీ అండ్ స్పైసీ చిల్లీ ఫిష్ రెడీ కొత్తిమిర తరుగును చల్లి సర్వ్ చేయడమే ఆలస్యం.

No comments:

Post a Comment